కేకే నివాసానికి దీపాదాస్‌ మున్షి.. పార్టీ మారతారని ప్రచారం

భారాస నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి కలిశారు.

Updated : 22 Mar 2024 19:27 IST

హైదరాబాద్‌: భారాస నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి కలిశారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన రాజకీయ చర్చల్లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతోన్న సమయంలో కేకేను కాంగ్రెస్‌ నేతలు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికలు ముమ్మరమయ్యాయి. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ సునితా మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం పార్టీలో చేరి లోక్‌సభ టికెట్లు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో కేకే, మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌ నేతలతో కలిసి చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు.. తాను పార్టీ మారడం లేదని కేకే స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని