YSRCP: మార్కాపురం వైకాపాలో అసమ్మతి.. అనుచరులతో జంకె వెంకట్‌రెడ్డి భేటీ

ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపాలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.

Updated : 09 Nov 2023 10:17 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపాలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అక్కడి టికెట్‌ను వెంకటరెడ్డి ఆశిస్తున్నారు. ఈనెల 6న నిర్వహించిన వైకాపా సామాజిక బస్సు యాత్ర సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. బుధవారం కనిగిరిలో జరిగిన బస్సు యాత్రకు సైతం బాలినేని, జంకె వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తన అనుచరులతో జంకె వెంకట్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. స్థానిక నేతలతో సంప్రదించకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గెలిపించాలని ఎలా చెబుతారని విజయసాయిరెడ్డిపై అసమ్మతి నేతలు మండిపడ్డారు. జంకె వెంకటరెడ్డితో స్థానిక నేతలు వెన్నా హనుమారెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని