BJP: ప్రశాంత్‌ కిశోర్‌ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలవు: ఈటల

భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ చైతన్య సదస్సులో భాజపా నేతలు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

Published : 30 Mar 2022 01:29 IST

సిద్దిపేట: భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ చైతన్య సదస్సులో భాజపా నేతలు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల  మాట్లాడుతూ.. బీసీలకు బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించి.. ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీసీలకు 33శాతం రిజ్వరేషన్ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రశాంత్‌ కిశోర్‌ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలవని, హుజూరాబాద్‌లో రూ.600 కోట్లు ఖర్చు చేసినా తెరాస గెలవలేదన్నారు. రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన భూములు అమ్మి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెరాస ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులే సీఎం అవుతారని, భాజపాలో సామాన్యుడు కూడా సీఎం అవుతారని తెలిపారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తుంచే ప్రయత్నం చేశారని, భవిష్యత్‌లో హరీశ్‌రావు వంతు కూడా వస్తుందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని