Eatala Rajender: ఎటూగాని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు: ఈటల రాజేందర్

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 19 Jul 2023 15:19 IST

హైదరాబాద్‌: తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. ఎటూగాని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో భేటీ అయిన ఈటల.. గోషామహల్‌ భాజపా నేతలతో సమావేశమయ్యారు.

భేటీ అనంతరం ఈటల మాట్లాడుతూ.. ‘‘భాజపా కార్యకర్తలపై భారాస ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గోషామహల్‌లో భాజపా కార్పొరేటర్లను భారాస నేతలు వేధిస్తున్నారు. భాజపా కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ శశికళపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గజ్వేల్‌లో అకారణంగా దాడి చేసి కొట్టారు. కేసులు పెట్టారు. 14 రోజులు జైల్లో పెట్టారు. ఈ రోజు బెయిల్‌పై బయటకు వచ్చారు. మీర్‌పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు.

భాజపా కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని భారాస నేతలు దాడులు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఓ సర్పంచ్‌ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. రాజాసింగ్‌పై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా పార్టీ పెద్దలతో మాట్లాడతా’’ అని ఈటల వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు