CM Stalin: రాజకీయంగా ఎదుర్కొలేకే ఈడీ దాడులు: స్టాలిన్‌

కేంద్రంలోని భాజపా (BJP) ప్రభుత్వం చేస్తోన్న అసంబధ్ద చర్యలను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తమిళనాడు (TamilNadu) సీఎం స్టాలిన్‌ (MK Stalin) అన్నారు. 

Published : 14 Jun 2023 01:32 IST

చెన్నై: రాజకీయంగా ఎదుర్కొలేక కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తమిళనాడు (TamilNadu) సీఎం స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర విద్యుత్తు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ (V Senthil Balaji) కార్యాలయంతోపాటు, సెక్రటేరియేట్‌లోని ఆయన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై సీఎం స్టాలిన్‌ తీవ్ర విమర్శలు చేశారు. 

‘‘కేంద్రంలోని భాజపా (BJP) ప్రభుత్వం తన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొలేక దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోంది. కేంద్రం బెదిరింపులకు భయపడేదిలేదు. అధికారం కోల్పోతామనే భయంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతోంది. భాజపా చేస్తోన్న అసంబద్ధ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారే సరైన గుణపాఠం చెబుతారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినప్పటికీ సెక్రటేరియేట్‌లోని మంత్రి కార్యాలయంలో సోదాలు చేయాల్సిన అవసరం ఏముంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యే. ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ’’ అని స్టాలిన్‌ విమర్శించారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) తమిళనాడులో పర్యటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కార్యాలయంపై ఈడీ దాడుల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని