Viveka Murdercase: వివేకా హత్యకేసులో ఆ ఇద్దరినీ కాపాడేందుకు విశ్వప్రయత్నం: డీఎల్‌ రవీంద్రారెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ

Updated : 13 Mar 2022 06:24 IST

ఖాజీపేట: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు. వివేకా హత్య కేసులో సునీత కుటుంబం ప్రమేయం లేకపోయినా వారిపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా ఖాజీపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసును సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని.. దీనిపై సీబీఐ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సొంత బాబాయి దారుణహత్యకు గురైతే సీఎం జగన్‌ ఆ రోజు సాయంత్రం వరకు పులివెందులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో నిందితులు ఎవరైనా సరే తప్పించుకోలేరని రవీంద్రారెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని