సీఏఏపై తీర్మానం అందుకేనా..?: లక్ష్మణ్‌

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని భాజపా ...

Published : 18 Feb 2020 01:31 IST

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మెజారిటీ పక్షాల మద్దతుతో పార్లమెంటులో తీసుకొచ్చిన ఓ చట్టాన్ని రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? లేక ఒవైసీ మెప్పు కోసమా? అని నిలదీశారు.

మత వివక్షకు గురైన వారి కోసమే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చామని, శరణార్థులకు భద్రత కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని లక్ష్మణ్‌ వివరించారు. అంత ప్రేమ ఉంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఎన్‌పీఆర్‌ను రాష్ట్రంలో అమలు చేస్తారో లేదో చెప్పాలన్నారు. ఎంఐఎం నాయకులను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని.. కానీ అదే పార్టీ నాయకులు కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దుకాణం బందయ్యే పార్టీ అని, ఆ పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని లక్ష్మణ్‌ అన్నారు.

ఇదీ చదవండి..
సీఏఏను రద్దు చేయాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని