‘మధ్యప్రదేశ్‌ వైరస్‌’ మహారాష్ట్రకు చేరదు: రౌత్‌

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’(ఎంవీఏ) ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మధ్యప్రదేశ్‌ వైరస్‌’ తమ దరికి చేరే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు..........

Published : 11 Mar 2020 15:06 IST

ముంబయి: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’(ఎంవీఏ) ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మధ్యప్రదేశ్‌ వైరస్‌’ తమ దరికి చేరే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా తర్వాత మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. 100 రోజుల క్రితమే ఆ పార్టీ చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమైందని.. ఎంవీఏ కూటమి రూపంలో మహారాష్ట్రను కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. 

మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ మద్దతుతో భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, మెజార్టీ కూడగట్టడంలో విఫలమవడంతో 80 గంటలు గడవకముందే రాజీనామా చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. భాజపా అధికారం కోసమే ఇలాంటి పనులు చేయిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ రౌత్‌ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని