డీజీపీ ఆఫీస్‌ ముందు చంద్రబాబు బైఠాయింపు

గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమపై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి...

Updated : 11 Mar 2020 20:00 IST

అమరావతి: గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమపై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. దాడిలో గాయపడిన నేతలతో పాటు దెబ్బతిన వాహనాలతో ఆయన ర్యాలీగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు సహా నేతలెవరూ లోపలికి ప్రవేశించకుండా పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో చంద్రబాబు సహా నేతలంతా బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.

చంద్రబాబుతో అదనపు డీజీ చర్చలు

బైఠాయించిన చంద్రబాబు వద్దకు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని కోరారు. మాచర్లలో దాడి వివరాలను చంద్రబాబు ఆయనకు వివరించారు. పక్కనే ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమ తమకు తగిలిన గాయాలను డీజీ రవిశంకర్‌కు చూపించారు. అనంతరం దెబ్బతిన్న వాహనాల దగ్గరకు తీసుకెళ్లి దాడి జరిగిన తీరును చంద్రబాబుతో సహా నేతలు డీజీకి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని