మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలి:యనమల

రాష్ట్రంలో వైకాపా రాక్షసత్వానికి సమాన పదం నిఘంటువులో కూడా లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నామినేషన్‌ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్న ప్రతిచోటా ఎన్నిక రద్దు చేయాలని..

Updated : 12 Mar 2020 17:47 IST

అమరావతి: రాష్ట్రంలో వైకాపా రాక్షసత్వానికి సమాన పదం నిఘంటువులో కూడా లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నామినేషన్‌ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్న ప్రతిచోటా ఎన్నిక రద్దు చేయాలని.. మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో కోర్టులే జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలన్నారు. తెదేపా నేతల ఇళ్లలో పోలీసులే మద్యం సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని యనమల ఆరోపించారు.

ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతతోనే స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయం వైకాపాకు ఏర్పడిందన్నారు. అందుకే కండబలం, ఆర్థికబలం, మంద బలంతో అరాచకాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వం, మంత్రులు కలిసి ఎన్నికల ప్రక్రియనే అప్రదిష్టపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఆయన అన్నారు. తెదేపా నాయకుల పర్యటనపై ప్రశ్నించడానికి మంత్రి బొత్స ఎవరని.. పర్యటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని