సమావేశాలు కుదించం: ప్రహ్లాద్‌ జోషి

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుదించబోమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టంచేశారు. బడ్జెట్‌ సమావేశాలు.....

Published : 13 Mar 2020 21:52 IST

దిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుదించబోమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాలు కుదిస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పందించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కుదించాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని జోషి పేర్కొన్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగిశాయి. మళ్లీ మార్చి 2 నుంచి రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 3 వరకు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని