తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికినపాడులో తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసే విషయంలోనే ఈ ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Published : 21 Apr 2020 23:24 IST



అమరావతి : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికినపాడులో తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసే విషయంలోనే ఈ ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక తెదేపా నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయితే ఇవాళే వైకాపా నేతలు కూడా సరుకులు పంపిణీ చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగడానికి కారణమైనట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని