భవన నిర్మాణ కార్మికులకు ₹10వేలు ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో 50 లక్షల మంది భవననిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు.

Published : 26 Apr 2020 01:01 IST

సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో 50 లక్షల మంది భవననిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పూట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఇసుక విధానం వల్ల ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచివేసిందని, ఇప్పుడు లాక్‌డౌన్‌ వారిని మరింత దెబ్బతీసిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ.1900 కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని కోరారు. చంద్రన్న బీమాను పునరుద్ధరించడంతో పాటు, వారి భవిష్యత్‌కు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని