ప్రధానికి.. సీఎంలు లేఖలు రాయాలి

ఇస్రోను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇప్పటికే రక్షణ - బొగ్గు గనులు ప్రైవేటుపరమయ్యాయన్న నారాయణ...

Published : 28 Jun 2020 01:08 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌: ఇస్రోను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇప్పటికే రక్షణ - బొగ్గు గనులు ప్రైవేటుపరమయ్యాయన్న నారాయణ... ఇస్రోలో ప్రైవేటును తీసుకొస్తే... సాంకేతిక పరిజ్ఞానమంతా ప్రైవేటుపరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్రోను ప్రైవేటు పరం చేయొద్దని ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధానమంత్రికి లేఖలు రాయాలని నారాయణ కోరారు. 

‘‘గతంలో ఇస్రో చైర్మన్ మాధవన్ ‘ప్రైవేటు’ను వ్యతిరేకించారు. సంస్కృతి- సంప్రదాయం గురించి మాట్లాడే... భాజపా పంచభూతాలను అమ్మేస్తోంది. ఇస్రోను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి. లాక్‌డౌన్‌ పెట్టిన మోదీనే లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి’’ అని నారాయణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని