BJP: వైరల్‌ వీడియోలుంటే భాజపా టికెట్‌ రానట్టే!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు ప్రారంభించింది.

Published : 30 Sep 2021 14:38 IST

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు ప్రారంభించింది. గెలుపు అవకాశాలతో పాటు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆ లెక్కన రాష్ట్రంలోని మొత్తం 304 మంది భాజపా ఎమ్మెల్యేలకుగానూ 100-125 మందికి మళ్లీ టికెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది. గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆడియోలు, వీడియోలలో వైరల్‌ అయి పార్టీ పరువును దిగజార్చినట్లుగా భావిస్తున్న సుమారు రెండు డజన్లకుపైగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. పార్టీ క్రమశిక్షణను పాటించనివారు, సొంత పనుల్లో నిమగ్నమై ప్రజాగ్రహానికి గురయిన వారిని కూడా దూరం పెట్టనున్నారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లతో పాటు, 350 స్థానాలు గెలుచుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని