AP News: రెండేళ్లలో రూ.29వేల కోట్లు వసూలు చేశారు: పట్టాభి

రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రజల నుంచి జగన్‌ ప్రభుత్వం

Published : 08 Nov 2021 14:37 IST

అమరావతి: రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రజల నుంచి జగన్‌ ప్రభుత్వం రూ.29వేల కోట్లు వసూలు చేసిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ప్రతి నెలా రూ.వెయ్యికోట్ల వరకూ ఈ వసూళ్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కవంటూ జులై 26న పార్లమెంట్‌లో కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. 

వాస్తవాలు కప్పిపుచ్చేలా నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. ఉన్న పన్నులపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.2చొప్పున తగ్గిస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం పన్నులు పెంచుతూ జీవోలు ఇచ్చిందని ఆరోపించారు. బాధ్యత కలిగిన పసుపు సైనికుడిలా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఆధారాలతో సహా బయట పెడుతూనే ఉంటానని పట్టాభి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని