Andhra News: ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో బాలినేని?

ఏపీ మంత్రివర్గ జాబితాలో తన పేరు లేనందున వైకాపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి

Updated : 11 Apr 2022 10:33 IST

ఒంగోలు: ఏపీ మంత్రివర్గ జాబితాలో తన పేరు లేనందున వైకాపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై ఇప్పటికే ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. సీఎం జగన్‌ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసే యోచనలో బాలినేని ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని అంశంపై ఆయన మాట్లాడనున్నారు.

మరోవైపు బాలినేనికి కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఆయన సొంత నియోజకవర్గం ఒంగోలులో వైకాపా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ వెంకటరెడ్డి, ఒంగోలు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌  కొటారి రామచంద్రరావు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్నిచోట్ల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కేబినెట్‌లో చోటుదక్కని నేపథ్యంలో హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె కుమార్తె రిషిత చెప్పారు. తన తల్లి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని.. పార్టీకి మాత్రం కాదని ఆమె నిన్న రాత్రి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని