ఇది కేసీఆర్‌ విధించిన సుంకం

అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన విద్యుత్తు సంస్థలను వెలుపలికి తీయడానికి వినియోగదారుడిని బాధ్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ) పేరిట డబ్బులు వసూలు చేస్తోందని, ఇది కేసీఆర్‌ ప్రజలపై విధించిన సుంకమని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 26 Jan 2023 05:03 IST

కాంగ్రెస్‌ నిరాహార దీక్షలో జీవన్‌రెడ్డి

భగత్‌నగర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన విద్యుత్తు సంస్థలను వెలుపలికి తీయడానికి వినియోగదారుడిని బాధ్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదనపు వినియోగ డిపాజిట్‌(ఏసీడీ) పేరిట డబ్బులు వసూలు చేస్తోందని, ఇది కేసీఆర్‌ ప్రజలపై విధించిన సుంకమని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లో విద్యుత్తు సంస్థ ఎదుట చేపట్టిన నిరహార దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌), సదరన్‌ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌)లు ఉంటే ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని విద్యుత్తు వినియోగదారులపైనే ఏసీడీ ఛార్జీలు ఎందుకు వేశారని, ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో బకాయిదారులే లేరా? ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఎస్‌పీడీసీఎల్‌ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని