గృహనిర్బంధంపై హైకోర్టుకు అఖిలప్రియ

ఆళ్లగడ్డ పోలీసులు తనను గృహనిర్బంధం చేయడంపై మాజీ మంత్రి అఖిలప్రియ శనివారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం వేశారు.

Published : 05 Feb 2023 04:38 IST

ఈనాడు, అమరావతి: ఆళ్లగడ్డ పోలీసులు తనను గృహనిర్బంధం చేయడంపై మాజీ మంత్రి అఖిలప్రియ శనివారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి వ్యాజ్యంపై విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలపై బహిరంగ చర్చకు వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంలో ఆళ్లగడ్డ పట్టణ సీఐ నోటీసు ఇచ్చి గృహనిర్బంధంలో ఉంచారన్నారు. ఎమ్మెల్యేకు మాత్రం నోటీసు ఇవ్వలేదని వివరించారు. ఈ నెల 4,5 తేదీల్లో నంద్యాల వెళ్లబోమని పోలీసులకు హామీనిచ్చేందుకు తాము సిద్ధమన్నారు. హామీ ఇస్తే తక్షణం నోటీసు ఉపసంహరించుకుంటామని హోంశాఖ సహాయ జీపీ పేర్కొన్నారు. వాదనలను నమోదు చేసి న్యాయమూర్తి వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని