వైకాపా రంగులు వేసేస్తాం.. విగ్రహాలు పెట్టేస్తాం?

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయడమే కాకుండా ఓ మూలన వైఎస్‌ఆర్‌ విగ్రహాలనూ ఏర్పాటు చేశారు.

Published : 05 Feb 2023 04:38 IST

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయడమే కాకుండా ఓ మూలన వైఎస్‌ఆర్‌ విగ్రహాలనూ ఏర్పాటు చేశారు. అదనపు హంగుల కోసం మున్సిపాలిటీ నిధులను వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చినకాకాని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ నిలువెత్తు విగ్రహాన్ని చిత్రంలో చూడొచ్చు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకుంటూ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడమే కాకుండా.. కనీసం కేంద్ర ఆరోగ్య మిషన్‌ లోగోనుగానీ, ప్రధాని మోదీ బొమ్మనుగానీ పెట్టకపోవడంపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ మండిపడ్డారు. విజయవాడలోని భవానీపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీలో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇవేమీ అధికారులు పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు