Telangana News: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 11న నామినేషన్లు స్వీకరించనున్నారు.

Published : 09 Feb 2023 14:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 11న నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న మండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. భారాస తరఫున ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మండలిలో భారాస మెజార్టీ అధికంగా ఉన్న నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఎన్నిక లాంఛనం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని