YSRCP: వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఐదుగురిపై కేసులు
ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు వైకాపా తరఫున నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థుల్లో ఐదుగురిపై కేసులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
పెన్మత్సకు రూ.12.46 కోట్లు.. ఇజ్రాయేల్‌కు రూ.6.20 లక్షల స్థిర, చరాస్తులు
నామినేషన్ల అఫిడవిట్‌లో వెల్లడి
ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు వైకాపా తరఫున నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థుల్లో ఐదుగురిపై కేసులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అత్యధికంగా ఇజ్రాయేల్‌పై తొమ్మిది కేసులు నమోదు కాగా, వీటిల్లో మూడు కేసులు మూసేశారు. మరో మూడు కేసులు కొట్టేశారు. మిగిలిన మూడు కేసుల్లో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసు ఉంది. పోతుల సునీతపై ఒక క్రిమినల్ కేసు ఉండగా, కోలా గురువులుపై రైలు రోకో కేసు ఉంది. ఏసురత్నంపై ఐదు, జయమంగళ వెంకటరమణపై నాలుగు కేసులు ఉన్నాయి. బొమ్మి ఇజ్రాయేల్, మర్రి రాజశేఖర్‌కు సొంత కార్లు లేవు. ఇజ్రాయేల్‌కు పల్సర్ బైక్ ఉండగా, మర్రి రాజశేఖర్ అసలు ఎలాంటి వాహనం తనకు లేదని వెల్లడించారు. నలుగురు అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, మరో ముగ్గురు ఇంటర్మీడియట్, పదో తరగతి అనుత్తీర్ణులు, ఇంటర్మీడియట్ మధ్యలో మానేసినవారు ఉన్నారు. పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజుకు స్థిర, చరాస్తులు కలిపి రూ.12.46 కోట్లు ఉండగా, ఇజ్రాయేల్ తనకు కేవలం రూ.6.20 లక్షల ఆస్తి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా చంద్రగిరి ఏసురత్నంకు రూ.1.30 కోట్లు అప్పు, రుణాలు ఉండగా.. అతి తక్కువగా ఇజ్రాయేల్‌కు రూ.1.50 లక్షల రుణం ఉంది.
అభ్యర్థి : బొమ్మి ఇజ్రాయేల్
పార్టీ: వైకాపా
విద్యార్హత: బీఏ
కేసులు: 9 కేసుల్లో మూడు మూసేయగా, మూడు కేసులు కొట్టేశారు. మిగతా మూడింటిలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసు ఉంది.
చరాస్తుల మొత్తం: రూ.1.20 లక్షలు. పల్సర్ బైక్ ఉంది. భార్యాభర్తలకు కలిపి చేతిలో నగదు రూ.10వేలే ఉన్నాయి.
బంగారం: 10 గ్రాములు
స్థిరాస్తి విలువ:రూ.5 లక్షలు. అమలాపురం మండలం గోడి గ్రామంలోని బరవపేటలో భార్య పేరుతో రూ.5 లక్షల విలువ ఇల్లు ఉంది.
అప్పులు: రూ.1.50 లక్షలు
అభ్యర్థి : జయమంగళ వెంకటరమణ
పార్టీ: వైకాపా
విద్యార్హత: ఇంటర్మీడియట (మధ్యలో ఆపేశారు)
కేసులు: నాలుగు కేసులు. ఐపీసీ 341, 188, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద నమోదయ్యాయి.
చరాస్తుల విలువ మొత్తం: రూ.36.95 లక్షలు
బంగారం: 108 గ్రాములు
స్థిరాస్తి విలువ: రూ.1.17 కోట్లు. మండవల్లి మండలం లెల్లపూడి గ్రామంలో 3.12ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అప్పులు: రూ.4 లక్షలు
అభ్యర్థి : పోతుల సునీత
పార్టీ: వైకాపా
విద్యార్హత: ఇంటర్
కేసులు: ఒక క్రిమినల్ కేసు ఉంది. ఐపీసీ 323, 506 రెడ్‌విత్ 34
చరాస్తుల విలువ మొత్తం: రూ.27.50 లక్షలు
బంగారం: 100 గ్రాములు
స్థిరాస్తి విలువ: 11.30లక్షలు. భార్యాభర్తలకు కలిపి మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో 6.51 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అప్పులు: రూ.13.22 లక్షలు
అభ్యర్థి : కోలా గురువులు
పార్టీ: వైకాపా
విద్యార్హత: పదో తరగతి (ఫెయిల్)
కేసులు: రైల్‌రోకో చేసినందుకు రైల్వే చట్టం ప్రకారం కేసు
చరాస్తుల మొత్తం: రూ.65.72 లక్షలు
బంగారం: 431.21 గ్రాములు
స్థిరాస్తి విలువ: రూ.2.86 కోట్లు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయన, కుటుంబసభ్యుల పేర్లపై 7.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అప్పులు: రూ.18.12లక్షలు
అభ్యర్థి : చంద్రగిరి ఏసురత్నం
పార్టీ: వైకాపా
విద్యార్హత: బీఏ (పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి)
కేసులు: ఐదు కేసులున్నాయి. ఐపీసీ 143, 341, 188తదితర సెక్షన్‌ల కింద నమోదయ్యాయి.
చరాస్తుల మొత్తం: రూ.1.14 కోట్లు
బంగారం:1,039 గ్రాములు
స్థిరాస్తి విలువ: రూ.7.15 కోట్లు
అప్పులు: రూ.1.30 కోట్లు
అభ్యర్థి : మర్రి రాజశేఖర్
పార్టీ: వైకాపా
విద్యార్హత: బీఎల్
కేసులు: లేవు
చరాస్తుల మొత్తం: రూ.29.09 లక్షలు
బంగారం: 420 గ్రాములు
స్థిరాస్తి విలువ: రూ.4.35 కోట్లు. పత్తిపాడు మండలం యనమదల, చందలూరుల్లో 13.75 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అప్పులు: రూ.70.94 లక్షలు
అభ్యర్థి : పెన్మత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు
పార్టీ: వైకాపా
విద్యార్హత: వైద్యుడు (బీడీఎస్)
కేసులు: లేవు
చరాస్తుల మొత్తం: రూ.71,79,390 కుటుంబసభ్యులు, ఆయన వద్ద కలిపి
బంగారం: 559.97 గ్రాములు
స్థిరాస్తుల మొత్తం: రూ.11.75 కోట్లు విజయనగరం జిల్లా గుర్ల్ల మండలం కెల్ల గ్రామంలో పదెకరాలు, మోయిడా విజయరాంపురంలో 20.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అప్పులు: రూ.37.46 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు