పండగలు వచ్చి, వెళ్తున్నా ఇంటి కల నెరవేరడం లేదు: మనోహర్‌

‘‘పండగలు వస్తున్నాయి, వెళ్తున్నాయి తప్ప పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. వైకాపా పాలకులు ప్రతి పండగకు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.

Published : 22 Mar 2023 05:28 IST

ఈనాడు, అమరావతి: ‘‘పండగలు వస్తున్నాయి, వెళ్తున్నాయి తప్ప పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. వైకాపా పాలకులు ప్రతి పండగకు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. సంక్రాంతికి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఆ తర్వాత ఉగాదికి ఇళ్లు ఇచ్చేస్తాం అన్నారు. కొత్త సంవత్సరం ఉగాది వచ్చినా పేదల సొంతింటి కల తీరలేదు. ఉగాదికి 5 లక్షల మందిని గృహప్రవేశం చేయిస్తామని వైకాపా పాలకులు చెప్పినా ఆ ఊసే లేదు’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో 17 వేల కాలనీల్లో 28 లక్షల ఇళ్లను కట్టబోతున్నామంటూ చెప్పారని, ఇప్పటి వరకు 4.4 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. 2022లో పండగ పండగకూ ముహూర్తాలు మార్చారని, ఇప్పటికీ ఇళ్ల తాళాలు పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని జేబులో వేసుకునేందుకు మాత్రమే జగనన్న ఇళ్ల కార్యక్రమం ఉపయోగపడింది తప్పితే పేదలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేకపోయారని మనోహర్‌ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని