దిల్లీలో విపక్ష నేతల భేటీ నేడు

సార్వత్రిక ఎన్నికలు(2024) సమీపిస్తున్న వేళ విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

Published : 23 Mar 2023 03:42 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు(2024) సమీపిస్తున్న వేళ విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎన్నికలకు సంబంధించిన విషయాలు, ఈవీఎంల సామర్థ్యం తదితర అంశాలపై చర్చించుకుందామంటూ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వివిధ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు దిల్లీలో ఈ సమావేశం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు ఈవీఎంలపై తలెత్తుతున్న సందేహాలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నివృత్తి చేయాల్సి ఉంటుందని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. చిప్‌ కలిగి ఉన్న ఏ యంత్రమైనా హైజాక్‌కు గురయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటూ నిపుణులు వెల్లడిస్తున్న వివిధ అంశాలను పవార్‌ ఆహ్వాన లేఖల్లో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని