హలాన్ని పట్టి.. పొలాన్ని దున్ని

శోభకృత్‌ ఉగాది వేడుకలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారం రైతుల మధ్య జరుపుకొన్నారు. కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్రకు ఉగాది సందర్భంగా బుధవారం విరామం ప్రకటించారు.

Published : 23 Mar 2023 03:42 IST

రైతులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉగాది వేడుకలు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: శోభకృత్‌ ఉగాది వేడుకలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారం రైతుల మధ్య జరుపుకొన్నారు. కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్రకు ఉగాది సందర్భంగా బుధవారం విరామం ప్రకటించారు. కెరమెరి మండలం ఝరిలో బస చేసిన ఆయన.. ఉదయం సమీపంలోని బారెమోడి శివారులోని రైతు వెంకట్‌రావు పంట చేనుకు వెళ్లారు. భూమాతకు, కాడెద్దులకు, నాగలికి పూజలు చేశారు. ఎడ్లకు నైవేద్యం పెట్టారు. నాగలి పట్టి కొద్దిసేపు దుక్కి దున్నారు. రైతులు, స్థానిక నాయకులతో కలిసి పొలంలోనే ఉగాది పచ్చడి, పులిహోరా, జొన్న గట్క తీసుకున్నారు. రైతు కుటుంబ సభ్యులకు కొత్త దుస్తులు పెట్టారు. రైతుల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని భట్టి ఈ సందర్భంగా అన్నారు. అనంతరం అక్కడి నుంచి కాలిబాటన మోడి గ్రామానికి వెళ్లారు. ఆదివాసీ పటేల్‌ ఇంటి వద్ద ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలతో సరదాగా గడిపారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని