నిజాంపై పోరాడిన అమరవీరులను నిర్లక్ష్యం చేశారు

దేశ స్వాతంత్య్రం కోసం, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. అమరవీరులైన వారిని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి కూడా స్మరించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు.

Published : 27 Mar 2023 02:58 IST

దక్షిణాది జలియన్‌ వాలాబాగ్‌ గోరాట
కాంగ్రెస్‌, భారాసలపై అమిత్‌షా ధ్వజం

బీదర్‌, న్యూస్‌టుడే: దేశ స్వాతంత్య్రం కోసం, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. అమరవీరులైన వారిని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి కూడా స్మరించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా గోరాట గ్రామం వద్ద సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని, 103 అడుగుల ఎత్తైన స్తంభానికి అమర్చిన జాతీయ పతాకాన్ని అమిత్‌షా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో షా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు కూడా హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు మనసు రావడం లేదని విమర్శించారు. గోరాట దక్షిణ భారతదేశ జలియన్‌ వాలాబాగ్‌ అని షా అభివర్ణించారు. గోరాటలో మువ్వన్నెల పతాకాన్ని పట్టుకున్న వారిని నిజాం సైనికులు హతమార్చారని.. నేడు ఇదే ప్రాంతంలో 103 అడుగుల ఎత్తులో ఉన్న జాతీయ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని వివరించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ కర్ణాటకను కల్యాణ కర్ణాటకగా పేరు పెట్టి మంచి పని చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా కర్ణాటక అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని