మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.

Published : 27 Mar 2023 02:58 IST

ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే : ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ నరేంద్రమోదీ, అమిత్‌షాలు దేశ భవిష్యత్తును అదానీ, అంబానీలకు అప్పగించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా భాజపా పాలనను ఎండగడతామన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసిన భాజపా చర్యలను దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ స్పందించాలన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు రామకృష్ణతోపాటు సీపీఐ నాయకులు జెల్లి విల్సన్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని