ఆమ్‌ఆద్మీ పార్టీకి హస్తం మద్దతు సందేహమే
పరిపాలన సేవల నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుపై మద్దతు కోసం ఆప్ చేసిన వినతిపై సానుకూలంగా స్పందించవద్దని దిల్లీ, పంజాబ్‌లకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
దిల్లీ: పరిపాలన సేవల నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుపై మద్దతు కోసం ఆప్ చేసిన వినతిపై సానుకూలంగా స్పందించవద్దని దిల్లీ, పంజాబ్‌లకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆప్ అంటే భాజపాకి ‘బి’ టీం వంటిదనీ, దిల్లీ, పంజాబ్‌లలోనే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అవకాశాలకు ఆప్ గండి కొట్టిందని ఆ రాష్ట్రాల నేతలు అభిప్రాయపడ్డారు. భేటీకి సమయం కేటాయించాల్సిందిగా ఖర్గే, రాహుల్‌లను ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరిన నేపథ్యంలో నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం జరిగింది. ఆర్డినెన్సు అంశం పూర్తిగా దిల్లీ సర్కారుకు పరిమితమని నేతలు అభిప్రాయపడ్డారు. ఏ వ్యక్తికో, ఆమ్ ఆద్మీ పార్టీకో మద్దతు పలకడానికి, దీనికి సంబంధం లేదన్నారు. తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ