భూ సమస్యలు పరిష్కారం కాలేదు: నారాయణ
తెలంగాణ సాధించుకొని దశాబ్దం కావస్తున్నా... భూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు.
హిమాయత్‌నగర్ న్యూస్‌టుడే: తెలంగాణ సాధించుకొని దశాబ్దం కావస్తున్నా... భూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. భూస్వాములకే తిరిగి చట్టబద్ధంగా భూములను కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో జాతీయ జెండాను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ... ‘ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవగానే శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోతారు. అవినాష్‌రెడ్డి వ్యవహారమూ తెలిసిందే. ఇదంతా క్విడ్‌ప్రోకో మాదిరిగా ఉంది. ఎమ్మెల్సీ కవితను లక్ష్యం చేయడానికే ఆంధ్ర సీఎంను భాజపా వాడుకుంటోంది’’ అని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ, అనుబంధ సంస్థల నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, ప్రేంపావని, ఛాయాదేవి, పడాల నళిని, కె.శ్రీనివాస్, పల్లె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు