భారాస మానవ వనరుల కేంద్రానికి నేడు సీఎం కేసీఆర్‌ భూమిపూజ

హైదరాబాద్‌లోని కోకాపేటలో భారాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ సెంటర్‌(మానవ వనరుల కేంద్రం)కు సీఎం కేసీఆర్‌ సోమవారం భూమిపూజ చేయనున్నారు.

Published : 05 Jun 2023 04:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కోకాపేటలో భారాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ సెంటర్‌(మానవ వనరుల కేంద్రం)కు సీఎం కేసీఆర్‌ సోమవారం భూమిపూజ చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ నిమిత్తం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు