మౌలికవసతులు కల్పించకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడం దోపిడీ కాదా?

జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ ప్రశ్నించారు.

Published : 08 Jun 2023 05:38 IST

తెదేపా అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ ప్రశ్నించారు. గ్రామాల్లో భూముల విలువ, ఆఖరికి పూడిగుడిసెలపై కూడా పన్ను పెంచడం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డివిరచడమేనని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏ ప్రాంతంలో అయినా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే.. అక్కడ భూములు, ఆస్తుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం ఆదాయంపై చూపుతున్న శ్రద్ధలో సగం కూడా మౌలికవసతుల కల్పనలో చూపడం లేదు. జగన్‌ పాలనలో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యాయి. అభివృద్ధి పథంలో నడపాల్సిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడం బాధాకరం...’’ అని నసీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని