సీఎం తీరుతో వాటా జలాలు దక్కడం లేదు: పొంగులేటి సుధాకరరెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వైఖరితో రాష్ట్రానికి వాటా జలాలు దక్కకుండా పోతున్నాయని భాజపా నేత, మాజీ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఆరోపించారు.

Published : 09 Jun 2023 04:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వైఖరితో రాష్ట్రానికి వాటా జలాలు దక్కకుండా పోతున్నాయని భాజపా నేత, మాజీ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఆరోపించారు. నదీ జలాల వాటా కాపాడటంలో భారాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి నీటి కేటాయింపులు, వినియోగంపై బహిరంగ చర్చకు రావాలని భారాస ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతోనే కడెం, సరళాసాగర్‌, మూసీ గేట్లు కొట్టుకుపోయాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని