Kodali Nani: ఉన్నోళ్ల కార్లకు బ్రేక్‌లు వేయకుండా రోడ్లు వేయాలా?: కొడాలి నాని

బెంజి కార్లలో తిరిగేవారు బ్రేకులు వేయకుండా నడిపేలా రోడ్లు ఉంటేనే అభివృద్ధా.. కిలోమీటరుకో గుంత ఉంటే ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయని మాజీ మంత్రి, గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.

Updated : 26 Nov 2023 07:38 IST

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: బెంజి కార్లలో తిరిగేవారు బ్రేకులు వేయకుండా నడిపేలా రోడ్లు ఉంటేనే అభివృద్ధా.. కిలోమీటరుకో గుంత ఉంటే ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయని మాజీ మంత్రి, గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) పేర్కొన్నారు. విద్యుత్తు, తాగు, సాగునీరు, ఇళ్ల అభివృద్ధి వారికి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీ కానీ, మంచినీటి చెరువుల అభివృద్ధి కానీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ అంబానీ, అదానీలకు రూ.వేల కోట్లు రుణాలిచ్చే బ్యాంకులు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని