అవసరమైతే ఎన్నికల సమయంలో నగదు పంపిణీ చేయాలి.. వాలంటీర్లతో వైకాపా ఎమ్మెల్యే

‘వాలంటీర్లు జగనన్న నియమించిన సైనికులు. అవసరమైతే ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయాలి’ అని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు.

Updated : 14 Mar 2024 07:00 IST

ఈనాడు-డిజిటల్‌ శ్రీకాకుళం, గొల్లప్రోలు, న్యూస్‌టుడే: ‘వాలంటీర్లు జగనన్న నియమించిన సైనికులు. అవసరమైతే ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయాలి’ అని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం పాతపట్నంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సుమారు 350 మంది వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవాలంటే వాలంటీర్ల సహకారం అవసరమని చెప్పారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు అందజేశారు.

  • వాలంటీర్లకు జగన్‌ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని.. అన్ని ఓట్లు వైకాపాకు వేయించే బాధ్యత వారిదేనని కాకినాడ ఎంపీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి వంగా గీత, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి సునీల్‌ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బుధవారం వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని