‘మీ సర్పంచి ఓడినా.. గెలిచినట్లు ప్రకటించా’

‘మీ ఊరి సర్పంచి ఓడినా.. గెలిచినట్లు ప్రకటించాను. నన్నే మోసం చేసి వెళ్లిపోతారా’ అంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Updated : 23 Mar 2024 17:20 IST

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్య

విడవలూరు, న్యూస్‌టుడే: ‘మీ ఊరి సర్పంచి ఓడినా.. గెలిచినట్లు ప్రకటించాను. నన్నే మోసం చేసి వెళ్లిపోతారా’ అంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరులో శుక్రవారం వైకాపా నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నల్లపరెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీలో చేర్చుకుంటే నా పేరు వాడుకొని చివరకు డబ్బు సంచుల కోసం వెళ్లిపోతారా’ అంటూ ధ్వజమెత్తారు. ఇటీవల పలువురు వైకాపా నాయకులను తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కలిసి మద్దతు తెలపాలని కోరగా వారు సరేననడంతో ప్రసన్న ఇలా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని