నకిలీ వార్తను నమ్మొద్దు: పురందేశ్వరి

‘ముస్లిం రిజర్వేషన్‌లపై నేను మాట్లాడినట్లుగా నకిలీ (ఫేక్‌) వార్తను సామాజిక మాధ్యమాల్లో పెట్టి, ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తను నమ్మొద్దు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.

Updated : 10 Apr 2024 08:52 IST

ఈనాడు, అమరావతి: ‘ముస్లిం రిజర్వేషన్‌లపై నేను మాట్లాడినట్లుగా నకిలీ (ఫేక్‌) వార్తను సామాజిక మాధ్యమాల్లో పెట్టి, ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తను నమ్మొద్దు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ‘‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ భాజపా నినాదం. అంటే సమాజంలోని అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి వైపు నడిపించడమే భాజపా అభిమతం. ఇందుకు భిన్నంగా ట్రోల్‌ అవుతున్న ఆ నకిలీ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాష్ట్ర కార్యాలయం నుంచి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పురందేశ్వరి పేర్కొన్నారు. ఇదే విషయమై రాష్ట్ర భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విడుదల చేసిన మరో ప్రకటనలో ‘రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేక వైకాపా పెయిడ్‌ ఆర్టిస్టులతో సామాజిక మాధ్యమాల్లో ఆమె అనని వ్యాఖ్యలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని