కాంగ్రెస్‌ ‘గ్యారంటీ కార్డు’ల ప్రచారాన్ని అడ్డుకోండి

‘ఇంటింటికీ (ఘర్‌ఘర్‌) గ్యారంటీ’ పేరుతో కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలు అవినీతి చర్యల కిందికే వస్తాయని, దానిని వెంటనే అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది.

Published : 17 Apr 2024 04:24 IST

ఈసీకి భాజపా వినతి

దిల్లీ: ‘ఇంటింటికీ (ఘర్‌ఘర్‌) గ్యారంటీ’ పేరుతో కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలు అవినీతి చర్యల కిందికే వస్తాయని, దానిని వెంటనే అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 3న గ్యారంటీ కార్డుల్ని ఇంటింటికీ పంపిణీ చేయడం ప్రారంభించారు. తాము చెబుతున్న లబ్ధిని పొందేందుకు దరఖాస్తులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అధికార ఆమోదం ఉందని చెప్పేలా ఖర్గే, రాహుల్‌గాంధీల హామీ సంతకాలు వీటిపై ఉంటున్నాయి. చట్టబద్ధమైన సాధనాలుగా గ్యారంటీ కార్డుల్ని చూపిస్తున్నారు. ఇది ఓటర్ల విశ్వాసాన్ని తారుమారు చేసే ప్రయత్నం. దీనిని అనుమతించడమంటే స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికల సూత్రాలకు విరుద్ధం. కార్డులను పంపిణీ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయించండి’ అని
వినతి పత్రంలో విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని