పార్లమెంటు నియోజకవర్గాలకు కిసాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జుల నియామకం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్రంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను నియమించింది.

Published : 18 Apr 2024 04:03 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్రంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను నియమించింది. ఈ మేరకు కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఇన్‌ఛార్జి అఖిలేశ్‌ శుక్లా బుధవారం ప్రకటన విడుదల చేశారు. జోనల్‌ ఇన్‌ఛార్జులుగా బి.సుబ్రమణియన్‌(ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి), సకీనా పటేల్‌(జహీరాబాద్‌, మహబూబ్‌నగర్‌), ఎం.బి.బాబు తిరుమల అప్పన్న(నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌, వరంగల్‌), ఎస్‌.కృష్ణచైతన్యరెడ్డి(ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ), సయ్యద్‌ బుహ్రుద్దీన్‌(భువనగిరి, చేవెళ్ల), గట్టు అనిల్‌కుమార్‌గౌడ్‌(మెదక్‌) నియమితులయ్యారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా రాజేందర్‌రెడ్డి-ఆదిలాబాద్‌, శ్రీకాంత్‌రెడ్డి-నిజామాబాద్‌, సత్యంరెడ్డి-పెద్దపల్లి, మల్లార్‌రెడ్డి-కరీంనగర్‌, యాదిరెడ్డి-వరంగల్‌, బాలాజీనాయక్‌-మహబూబాబాద్‌, మధుసూదన్‌-ఖమ్మం, డేనియల్‌-నల్గొండ, గుట్టయ్యగౌడ్‌-భువనగిరి, జనార్దన్‌రెడ్డి-నాగర్‌కర్నూల్‌, మోహన్‌రెడ్డి-మహబూబ్‌నగర్‌, శ్రీపాల్‌రెడ్డి-చేవెళ్ల, శ్రీనివాస్‌-మెదక్‌, రఘురామ్‌పాటిల్‌-జహీరాబాద్‌ నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని