కేసీఆర్‌దే లిల్లీపుట్‌ మనస్తత్వం: మల్లు రవి

అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.

Published : 18 Apr 2024 04:03 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ‘‘కేసీఆర్‌ది లిల్లీపుట్‌ మనస్తత్వం కాబట్టే ప్రజలు అధికారం నుంచి దించేశారు. మీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితికి తెచ్చారు. మీ అహంకారపు మాటలతోనే భారాస ఖాళీ అవుతోంది. నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నారు. కుమార్తె కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు కేసీఆర్‌ భాజపాతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని ఆ పార్టీకి సహకరిస్తున్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు