నా భార్య కూడా మీలా తిట్టదు సార్‌

లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వినయ్‌ కుమార్‌ సక్సేనాకు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వినూత్నంగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఎల్‌జీ గారు తిట్టినట్లు నా భార్య కూడా నన్ను రోజూ తిట్టదు.

Updated : 07 Oct 2022 06:08 IST

దిల్లీ ఎల్‌జీకి సీఎం కేజ్రీవాల్‌ కౌంటర్‌

దిల్లీ: లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వినయ్‌ కుమార్‌ సక్సేనాకు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వినూత్నంగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఎల్‌జీ గారు తిట్టినట్లు నా భార్య కూడా నన్ను రోజూ తిట్టదు. గడిచిన ఆరు నెల్లలో ఆయన రాసినన్ని ప్రేమలేఖలు నా శ్రీమతి నాకు రాసి ఉండదు’’ అంటూ ఎల్‌జీకి చురకలు అంటిస్తూ ట్విటర్‌లో పేర్కొన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో అభిప్రాయభేదాల నేపథ్యంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఇటీవల తనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వరుసగా లేఖలు రాయడంపై ఇలా భిన్నంగా స్పందించారు. ‘‘ఎల్‌జీ గారు కాస్త శాంతించండి. మీ సూపర్‌ బాస్‌ను కూడా కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పండి’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని