Andhra News: రాజ్యసభలో గుడివాడ క్యాసినో ఘటన ప్రస్తావన

కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రస్తావించారు.

Updated : 07 Feb 2022 12:39 IST

దిల్లీ: కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల విషయంలో మాట తప్పుతూనే ఉందని ఆరోపించారు.

కనకమేడల మాట్లాడుతున్న సమయంలో వైకాపా ఎంపీలు అడ్డుపడటంతో వారిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ వారించారు. అనంతరం ఇచ్చిన సమయం అయిపోయిందంటూ మైక్‌ కట్‌ చేశారు. అంతకముందు కనమేడల మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం మాదకద్రవ్యాలు, గంజాయికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నారు.అన్యాయాలపై పోరాడితే ప్రతిపక్ష నేతలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు’’ అని కనకమేడల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని