Gujarat Elections: గుజరాత్‌ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్‌ ప్రారంభం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Published : 01 Dec 2022 08:51 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మొత్తం ఓటర్లు 4.91 కోట్లు కాగా తొలి విడతలో 2.39 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

సాధారణంగా భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ఉండే ఎన్నికల పోరు.. ఈసారి ఆప్‌ రంగ ప్రవేశంతో త్రిముఖ పోటీగా మారింది. 2017లో తొలి దశలో పోలింగ్‌ జరిగిన 89 స్థానాల్లో భాజపా-48, కాంగ్రెస్‌-40 సీట్లను గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని