Rajasthan: ‘భాజపా అధికారంలోకి వచ్చే వరకూ రాత్రి భోజనం చేయను.. తలపాగా చుట్టను’

రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తాను రాత్రి పూట భోజనం చేయనని.. తలపాగ, పూలమాలలు ధరించనని ఆ పార్టీ నేత సతీశ్‌ పూనియా ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు రాజస్థాన్‌ భాజపా

Updated : 04 Feb 2022 14:53 IST

శపథం చేసిన రాజస్థాన్‌ భాజపా అధ్యక్షుడు

లఖ్‌నవూ: రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తాను రాత్రి పూట భోజనం చేయనని.. తలపాగ, పూలమాలలు ధరించనని ఆ పార్టీ రాష్ట్ర నేత సతీశ్‌ పూనియా శపథం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సతీశ్‌ యూపీకి వచ్చారు. గురువారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. యూపీలో భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాజస్థాన్‌లో రైతు వ్యతిరేక, యువత వ్యతిరేక కాంగ్రెస్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, భాజపాకు అధికారం కట్టబెట్టే వరకు తాను తలపాగ, పూలమాలలు ధరించబోనని ప్రకటించారు. రాత్రి పూట భోజనం తినడం మానేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2023) రాజస్థాన్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం, ప్రజలకు అనుకూలమైన విధానాలతో తమ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందని సతీశ్‌ పూనియా తెలిపారు. 

యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 10న జరగనుంది. పూర్తి ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని