
TS News: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఘన విజయం
హుజూరాబాద్: హోరా హోరీగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. సమీ ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై దాదాపు 24,068 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. ఎనిమిదో రౌండ్, 11వ రౌండ్‌లో మాత్రం గెల్లు స్వల్ప ఆధిక్యం కనబర్చారు. భాజపా 51.96 శాతం, తెరాస 40.38 శాతం, కాంగ్రెస్ 1.46 శాతం ఓట్లు సాధించాయి. పోస్టల్ ఓట్లలో భాజపాకు 242, తెరాసకు 455, కాంగ్రెస్‌కు 2 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లతో కలిపి 22 రౌండ్ల లెక్కింపు తర్వాత భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,014 ఓట్లు వచ్చాయి. ఈటల విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.