Jaggareddy: పీసీసీ చీఫ్ పదవి కోరుకోవడం తప్పు కాదు: జగ్గారెడ్డి

భారాస అధినేత కేసీఆర్‌ అధికారం కోల్పోయి ప్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. 

Updated : 09 Apr 2024 21:23 IST

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఫ్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వంద రోజుల రేవంత్‌ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి అవమానం 2.. రాజపూజ్యం 16 అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళల్ని అడగాలని సూచించారు. పీసీసీ చీఫ్‌ పదవి కోరుకోవడం కొత్త కాదు.. అడగడం తప్పు కాదన్నారు. పీసీసీ మార్పునకు ఇంకా కొంత సమయం ఉందని, తొందరేమీ లేదని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం ఒక్కరే ఉంటే బాగుంటుందని రేవంత్‌రెడ్డినే కొనసాగిస్తున్నారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని