వరంగల్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ.. అభ్యర్థి ఎంపిక అధినేత నిర్ణయానికే!

లోక్‌సభ ఎన్నిక కార్యాచరణపై భారాస అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 

Updated : 13 Mar 2024 18:23 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై భారాస అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితర నేతలు సమావేశానికి హజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణతో పాటు అభ్యర్థిత్వంపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను మాజీ మంత్రులు దయాకర్‌రావు, సారయ్య.. కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు.

అభ్యర్థి ఎంపికను కేసీఆర్‌ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని అధినేత వారితో చెప్పినట్లు సమాచారం. వరంగల్‌ ఎంపీగా పోటీ చేసేందుకు ఆరూరి రమేశ్‌ విముఖత చూపినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనవసర నిర్ణయాలతో భవిష్యత్‌ పాడు చేసుకోవద్దని రమేశ్‌కు కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం. అవకాశమిస్తే మరోసారి పోటీ చేస్తానని ఎంపీ పసునూరి దయాకర్‌ వెల్లడించారు.

మరోవైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో బీఎస్పీ నేతలు సమావేశమయ్యారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీ రాంజీ గౌతమ్‌ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చిస్తున్నారు. మాయావతి రాయబారిగా చర్చల్లో రాంజీగౌతమ్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని