Kishan Reddy: హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి: కిషన్‌రెడ్డి

హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Published : 07 Sep 2023 14:51 IST

హైదరాబాద్‌: హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో రవీందర్‌ను ఆయన పరామర్శించారు. 

అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోందని.. ప్రతికూల పరిస్థితుల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలన్నారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని.. ఆ మాట నిలబెట్టుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని