Kishan Reddy: చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదు: కిషన్‌ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు.

Updated : 14 Sep 2023 16:15 IST

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)పై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం అది కాదని.. ఒకవేళ ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలని చెప్పారు. ఆ తర్వాత అరెస్టు నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్టులోనూ దర్యాప్తు సంస్థలు అదే విధంగా వ్యవహరించాయన్నారు. ఎక్కడైనా సరే రాజకీయ కక్షలు ఉండొద్దని కిషన్‌ రెడ్డి హితవు పలికారు.

ఆ విషయం నాకు తెలియదు

మరోవైపు, దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవితకు నోటీసుల వచ్చిన విషయం తనకు తెలియదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీలో జనసేన, తెదేపా పోత్తులపై ఏపీ భాజపా అధ్యక్షురాలు మాట్లాడతారని చెప్పారు. తెలంగాణలో తమకు ఎటువంటి పొత్తులు లేవని స్పష్టం చేశారు. ‘‘భారాస, కాంగ్రెస్ ఒక్కటే అని పలు సందర్భాల్లో నిరూపితమైంది. ప్రస్తుతం కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. తెలంగాణలో ఎన్నికలు నిర్దేశించిన సమయం ప్రకారమే జరుగుతాయి. జమిలి ఎన్నికలు అంటూ భారాస రాజకీయం చేస్తోంది. భాజపా ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న జాబితా ఎవరో సృష్టించిన నకిలీ జాబితా. కాంగ్రెస్ సభను భాజపా అడ్డుకుంటుందని అనడంలో వాస్తవం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది’’ అని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని