Kishanreddy: అవిశ్వాస తీర్మానానికి భారాస మద్దతును ప్రజలు గమనిస్తున్నారు: కిషన్‌రెడ్డి

సంకీర్ణ ప్రభుత్వంలో భారాస కీలకం అవుతుందని కేటీఆర్‌ అన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారాస, కాంగ్రెస్‌ మధ్య లోపాయికార ఒప్పందం ఉంని ఆరోపించారు.

Updated : 09 Aug 2023 22:41 IST

దిల్లీ: సంకీర్ణ ప్రభుత్వంలో భారాస కీలకం అవుతుందని కేటీఆర్‌ అన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలుస్తామని కేటీఆర్‌ చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి భారాస మద్దతును ప్రజలు గమనిస్తున్నారు. భారాస, కాంగ్రెస్‌ మధ్య లోపాయికార ఒప్పందం ఉంది. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి పాలన పోవాలి. కాంగ్రెస్‌ను ఓడించాలనే 2009 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేశాం. మేము ఎప్పుడూ తెరాసతో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకోవడం వేరు, ఓటు వెయ్యడం వేరు. రాహుల్‌ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోక్‌సభలో రాహుల్‌ వ్యాఖ్యలను ప్రజలెవ్వరూ హర్షించరు. భరతమాతను, హిందూస్థాన్‌ను ఎవరూ హత్య చేయలేరు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని