Komatireddy Rajgopal Reddy: భాజపాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

తెలంగాణలో భాజపాకు షాక్‌ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Updated : 25 Oct 2023 12:19 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భాజపాకు షాక్‌ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. నా ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. భారాసకు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. ప్రజల ఆలోచన మేరకు వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార భారాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదిగి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు ప్రజలు భారాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తపన పడ్డాను’’ అని రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని